ఉరవకొండ: చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెలుగుప్ప వాసి అక్కడికక్కడే మృతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన ఏం అశోక్ రెడ్డి ఎంబీఏ వరకు చదివి చెన్నై లో ది బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ కంపెనీలో విధులు నిర్వహించేవాడు శనివారం తెల్లవారుజామున విధులు నిర్వహించుకుని అనంతరం కంపెనీ కారులోనే తిరిగి రూమ్ కి బయలుదేరుగా మార్గమధ్యలో డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఓవర్ ట్రాక్ చేయడంతో ముందురున్న లారీకి ఢీకొట్టడంతోఅశోక్ రెడ్డి (29) అక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య గిరిజ ఐదు నెలల గర్భిణీ. బెళుగుప్ప కు చెందిన వెంకటేశులు రత్నమ్మల కుమారుడైన అశోక్ రెడ్డి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.