నారాయణపేట్: దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్ గారు దామరగిద్ద పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి సమయపాలనపై హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, విఠలపూర్ గ్రామంలో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత మరియు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.