రాప్తాడు: అనంతపురంలో YSR పార్టీ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రాప్తాడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం 11 నెల నుంచి 4:30 గంటల వరకు నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిది ఓబులేష్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఓబులేసు మాట్లాడుతూ డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిబిఐ చేత విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిది ఓబులేష్ పేర్కొన్నారు.