చిత్తూరు: పంచాయతీ ఎన్నికల వేళ చిత్తూరు పోలీసుల పల్లెనిద్ర.. గ్రామాల్లో అవగాహన
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఓటర్లలో అవగాహన కోసం ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.