చిత్తూరు: జిల్లాలో రేపు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల పోలింగ్: పూర్తి వివరాలు
జిల్లాలో ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 94 వార్డుల్లో పోటీ ఉండగా, 2,79,819 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 385 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.