ఒంగోలు: జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం: ఏమేమి ఇస్తున్నారంటే?
జిల్లాలో గురువారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ మొదలవుతోంది. 5,16,806 మంది కార్డుదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేయనుండగా, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు అందించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంటాయని పౌరసరఫరాల శాఖ తెలిపింది.