గార్ల: గార్లలో బీజేపీ నాయకుల అక్రమ హౌస్ అరెస్ట్: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అజ్మీరా రాము ఫైర్
గార్లలో 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ చర్యను మహబూబాద్ జిల్లా బీజేపీ నాయకులు అజ్మీరా రాము తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.