గార్ల: జీలుగు విత్తనాలతో భూమిలో సారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది,గార్ల సొసైటీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య
జిలుగు విత్తనాలతో భూమిలో సారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని ఇల్లందు శాసనసభ్యులు అన్నారు వారి సాగు చేసే నేలలలో జీలుగు విత్తనాలు చల్లడం వల్ల భూమిలో సారం పెరిగి అధిక దిగుబడి రాబట్ట వచ్చునని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు గార్ల సొసైటీ కార్యాలయంలో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ కార్యక్రమం తో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చిరొట్టను ప్రతి ఒక్క రైతు తన పొలంలో వరిసాగుతున్న ముందు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు.