గార్ల: గార్లలో గోదావరి జలసాధనసమితి ఆధ్వర్యంలో గోదావరి జలాల అవగాహన సదస్సు, పాల్గొన్న స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్
గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్న ఏజెన్సీ ఆదివాసి గిరిజన ప్రాంతాల ప్రజలకు తాగు సాగునీరు ఇవ్వకుండా, ఖమ్మం జిల్లాలోని కృష్ణ బేసిన్ కు సీతారామ ప్రాజెక్టు ద్వార గోదావరి జలాలను తరలించడం రాజ్యాంగ విరుద్ధమని ,తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ ప్రముఖ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. గార్ల అంబేద్కర్ భవన్లో గోదావరి జలాల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గోదావరి జిల్లాల అవగాహన సదస్సులో చలకాని వెంకట్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.