గార్ల: గార్ల-రాంపూర్ పాకల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు
గార్ల -రాంపురం పాకాల ఏటి పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ, సిపిఐ ఆధ్వర్యంలో గార్ల పట్టణ కేంద్రంలో నిరాహార దీక్షలను చేపట్టారు.ఈ దీక్షలకు పలు ప్రజాసంఘాలు,పార్టీలు పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేసారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు బ్రిడ్జిని నిర్మిస్తామని గార్ల మండల ప్రజలను మోసం చేశారని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయినా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ చిరకాల కోరికను నెరవేర్చాలని కోరారు, చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా పలు రూపాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని, విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రముఖ లాయర్ జంపాల విశ్వ వెల్లడించారు.