గార్ల: గార్ల చెరువు శిఖం ఆక్రమించిన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, గార్లలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్
.గార్ల చెరువును సమగ్ర విచారణ చేసి దురాక్రమన చేసిన వారిని శిక్షించాలని,రైతులకు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ఏ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జడ సత్యనారాయణ మాట్లాడుతూ గార్ల చెరువు కింద 600 ఎకరాల భూమి రైతులు సేద్యం చేసుకుంటున్నారని, ఇప్పుడు 396 ఎకరాల 29 గంటలు మాత్రమే ఉందని ఇందులో 203 ఎకరాల 29 గుంటలు కబ్జాదారులు ఆక్రమించారని,విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.