మరిపెడ: మరిపెడ తానంచర్ల ఆనకట్టను వెంటనే నిర్మించాలి: సిపిఎం డిమాండ్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల ఆనకట్టను తక్షణమే నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆనకట్ట పూర్తి కావడం వల్ల 5 మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వెంటనే పనులు చేపట్టకపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.