కనిగిరి: ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దోహదం చేస్తుంది: వెలిగండ్ల ఎస్సై కోటేశ్వరరావు
వెలిగండ్ల లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులతో కలిసి ఎస్సై కోటేశ్వరరావు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించగా, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆ ర్యాలీని అనుసరించి అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.