చిత్తూరు: వెంగనపల్లిలో మధుమేహ అవగాహన కార్యక్రమం, 50 మందికి పరీక్షలు
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా వెంగనపల్లిలో ఎస్.వి. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. నర్సింగ్ విద్యార్థులు మధుమేహ నివారణ, ఆహారం, వ్యాయామంపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా 50 మందికి ఉచితంగా మధుమేహ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.