ఉరవకొండ: బెలుగుప్పలో రీ సర్వే పై అవగాహన సదస్సు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వన్నూరు స్వామి కట్టిమీద గురువారం రీ సర్వే పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు మల్లికార్జున, పెద్ద తిప్పయ్యలు పాల్గొనగా డిప్యూటీ తహసిల్దార్ గురుబ్రహ్మ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిటి మాట్లాడుతూ రీ సర్వే యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి సర్వే సమయంలో రైతులందరూ తమ హక్కు పత్రాలుతో హాజరై రీ సర్వే కు సహకరించవలసిందిగా డిప్యూటీ తహసిల్దార్ కోరడమైనది, ఈ కార్యక్రమంలో సర్వేయర్ వినోద్ కుమార్, వీఆర్వోలు ప్రదీప్ కుమార్, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు