అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గుండ్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ మండల కన్వీనర్ చిన్న మచ్చన్న ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పురుషోత్తం అధ్యక్షతన మెడికల్ కాలేజీ లు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండకార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడమే కూటమి ప్రభుత్వము పనిగా పెట్టుకుందని దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలతో కను విప్పు కల్పిద్దామని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.