ఉరవకొండ: గుండ్లపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత సంతానోత్పత్తి కన్సల్టేషన్ మరియు కౌన్సిలింగ్ పైన బెంగళూరుకు చెందిన మిలన్ ఫెర్టిలిటీ మరియు బర్థింగ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్య ఫెర్టిలిటీ నిపుణులు అన్నోమేరి కొంగారి పాల్గొన్నారు. సంతానం లేని సుమారు 50 మంది దంపతులకు కౌన్సిలింగ్ తో పాటు పరీక్షలను నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రోహిత్ స్థానికులు చిత్తప్ప, బాలురెడ్డి తదితరులు పాల్గొన్నారు