కళ్యాణదుర్గం: కుందుర్పి మండల వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అత్యంత ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
కుందుర్పి మండల వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా ఆలయాలు అర్చనలు, అభిషేకాలు వంటి పూజల నిర్వహించారు. మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది.