కుందుర్పి మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలి వద్ద నుంచి పురవీధుల గుండా ర్యాలీ చేశారు. జై చత్రపతి శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాల నాయకులు మాట్లాడారు. అందరూ చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చత్రపతి శివాజీ గొప్పతనం, జీవిత చరిత్ర గురించి వివరించారు.