బ్రహ్మసముద్రం మండలం మాముడూరు గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి ఓ చిరుత హల్చల్ చేసింది. కృష్ణమూర్తి అనే రైతుకు చెందిన ఆవు దూడను ఎత్తుకెళ్లింది. కొంత దూరం తీసుకెళ్లి చంపి తినింది. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు, గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.