కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని రాంపురం నుంచి వైసీ పల్లి గ్రామం వరకు సీ సీ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో నిధులు మంజూరయ్యాయని గురువారం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. రాంపురం నుంచి వైసీ పల్లి గ్రామం వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో రాంపురం, వైసీపల్లి గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.