సెట్టూరు మండలం మాకోడికి పాఠశాల అభివృద్ధి కోసం అదే గ్రామానికి చెందిన పూజారి ప్రసాద్ శుక్రవారం భారీగా విరాళం అందజేశారు. దాత పూజారి ప్రసాద్ రూ.1,00,116 నగదును అందజేశారు. పూజారి ప్రసాద్ స్వయంగా మాకోడికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులుకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపుమేరకు స్పందించానన్నారు. భవిష్యత్తులో కూడా పాఠశాల కు సాయం అందజేస్తానన్నారు.