కొత్తగూడెం: యాసంగిలో వరి సాగు వద్దు: రైతులను హెచ్చరించిన వ్యవసాయ శాఖ అధికారి
ఎల్ నినో ప్రభావంతో యాసంగిలో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, రైతులు వరి సాగుకు బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని మణుగూరు వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. నీటి లభ్యత, విద్యుత్ సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.