మహబూబాబాద్: మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలు
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ మాట్లాడుతూ, దేశ విద్యారంగానికి ఆయన చేసిన కృషిని, ఆదర్శాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.