గార్ల: గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల కీలక ఆదేశాలు - డీజేలపై నిషేధం
గార్ల పోలీస్ స్టేషన్లో గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గణేష్ మండపాలకు ఆన్లైన్ అనుమతి తప్పనిసరి అని, రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ సాయికుమార్ స్పష్టం చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.