చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.