రాప్తాడు: సోములదొడ్డి ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో నగరంలో సప్తగిరి సర్కిల్ వద్ద నుంచి జగన్నాథ రథయాత్ర
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అనంతపురం రూరల్ లోని ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద నుంచి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక గురువు సత్య గోపీనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ మేనేజర్ దామోదర్ దాస్ మాట్లాడుతూ సోమలదొడ్డి ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని శ్రీ జగన్నాధుని దర్శించుకోవడం జరిగిందని ఇస్కాన్ మేనేజర్ దామోదర్ దాస్ పేర్కొన్నారు.