దంతాలపల్లి: ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలి: ఊడుగుల లింగన్న డిమాండ్
దంతాలపల్లి మండలం రేక్యతండాలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న స్పందించారు. కార్మికులకు 200 రోజుల పని, 600 రూపాయల కనీస వేతనం కల్పించాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.