దంతాలపల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆగపేటలో బీఎస్పీ నేతలు వెల్లడి
దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేర్లు వచ్చినప్పటికీ ,ఇల్లు మంజూరు చేయడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ మేరకు ఆగపేట గ్రామాన్ని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎల్ విజయకాంత్ ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు. పూరి గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్న అర్హులైన పేదలను కాదని ,అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని బిఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లిస్టులో పేరు వచ్చినప్పటికీ స్థానిక నాయకులు ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారని ,వెంటనే అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.