ఉరవకొండ: ఖరీఫ్ లో సాగైన పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ సుమతిలు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ కూడేరు బెలుగుప్ప మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. రైతులు ఎల్ ని నో ఎక్కువ ప్రభావం ఉండడం మూలంగా తక్కువ కాలం ఎవరి పంటల సాగు చేపట్టాలన్నారు. సాగైనా పంటలకు 19.19. 19 ఎరువులు కేజీ చొప్పున ఎకరాకు పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సంపత్ కుమార్, జయలక్ష్మి, విజయ,శంకర్ బాబు,నారాయణస్వామి,. నటరాజ్, భాస్కరరావు పాల్గొన్నారు.