రాప్తాడు: వై కొత్తపల్లి వద్ద దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఇటికలపల్లి సర్కిల్ సీఐ హేమంత్ కుమార్
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయములో ఇటికలపల్లి సర్కిల్ సీఐ హేమంత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఐ హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 16న అనంతపురం రూరల్ లో బులోరా వాహనంలో అడ్డగించి బులోరా వాహనాన్ని ఎత్తుకెళ్లి టాటా ఇండికా కారును అడిగించి 20వేల రూపాయలు నగదును దోచుకొని వెళ్లిన నిందితులు పై కొత్తపల్లి వద్ద దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంలో భాను ప్రకాష్ రామ్ చరణ్ ను అదుపులోకి తీసుకొని ఇండికా కారు సెల్ ఫోన్ పదివేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ హేమంత్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు.