చిత్తూరు: వినాయక చవితి వేడుకలపై ఎస్పీ తుషార్ కీలక సూచనలు
వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ తుషార్ శుభాకాంక్షలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలను పోలీసు నిబంధనల ప్రకారం, శాంతియుతంగా నిర్వహించాలని మండప నిర్వాహకులను ఆయన కోరారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.