చిత్తూరు: చిత్తూరు కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు: జలహారతి నిర్వహణ
చిత్తూరు కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జలశుద్ధి, జల హారతి కార్యక్రమాలను నిర్వహించారు. నిమజ్జన ప్రక్రియ నగరపాలక సంస్థ పర్యవేక్షణలో జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.