ఉరవకొండ: వర్షాల కోసం కొట్టాలపల్లి గ్రామంలో వింత ఆచారం పాటించారు.కాటమయ్యగా భావించి శునకానికి పూలను అలంకరించి పూజలతో విందు భోజనం
వర్షాల కోసం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామస్తులు రైతులు కలిసి కాటమయ్యగా భావించే శునకానికి పూలతో అలంకరించి, కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి భోజనం తరహాలో వంటకాలు సిద్ధం చేసి శునకానికి వడ్డించి తినిపించారు. అయితే కుక్కకు నీళ్లు ఇవ్వకుండా వదిలేస్తే వర్షాలు కురుస్తాయని, ఈ ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోందని గ్రామస్థులు తెలిపారు. పూజల అనంతరం పొలంలోనే గ్రామస్థులంతా సహపంక్తి భోజనం చేశారు. *మీ సాక్షి టీవీ 'గరం గరం' వార్తల్లో...*