డిచ్పల్లి: రాంపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం: 137 మందికి పరీక్షలు
డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో 20 రోజులుగా ప్రబలుతున్న జ్వరాల నేపథ్యంలో అధికారులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సుశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 137 మందికి పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, సర్పంచ్ మరియు యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.