ఇందల్వాయి: చంద్రాయన్పల్లి వద్ద తరచూ ప్రమాదాలు: రోడ్డు పనులను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
జాతీయ రహదారి 44 పై ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద జరుగుతున్న ప్రమాదాలపై సీపీ సాయి చైతన్య దృష్టి సారించారు. అక్కడ జరుగుతున్న కల్వర్టు పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారుల భద్రత కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.