పామూరు మండలంలోని దూబగుంటలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మించాలని వేరే ప్రాంతంలో కళాశాల నిర్మాణం చేయవద్దని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ.... గతంలో పామూరు మండలం దూబగుంటలో సీఎం చంద్రబాబు ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఈ ప్రాంతంలోనే కళాశాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.