ఖమ్మం రూరల్: ప్రాజెక్టులపై అబద్ధాలు మానుకోండి: గత పాలకులపై మంత్రి పొంగులేటి విమర్శలు
జలయజ్ఞం ప్రాజెక్టుల విషయంలో గత పాలకుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుల పూర్తి దశలో తామే నిర్మించామని చెప్పుకోవడం సిగ్గుచేటని, ప్రాజెక్టులపై అబద్ధాలు మానుకోవాలని ఆయన విమర్శించారు. గత 35 నెలల్లో భూసేకరణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశామన్నారు.