మధిర: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల: ఖమ్మం జిల్లాలో 1.54 లక్షల మంది ఓటర్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.54 లక్షల మంది ఓటర్లు నమోదు కాగా, గత ఎన్నికలతో పోలిస్తే 30,208 మంది పెరిగారు. కొత్తగా ఓటు నమోదుకు డిసెంబర్ 10 వరకు అవకాశం ఉంది.