హత్నూర: దౌల్తాబాద్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీసుల సమావేశం జరిగింది. సీఐ రమణారెడ్డి, ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.