హత్నూర: బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఎమ్మెల్యే హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో గురువారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. నర్సాపూర్ నియోజకవర్గ అత్నూర్ మండల మాజీ జడ్పిటిసి, కెవిఆర్ ఫౌండేషన్ చైర్మన్ శరత్చంద్ర మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ తన అనుచరులతో ఎమ్మెల్యే సునీత రెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.