హత్నూర: కాసాలలో వీధి కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి, లక్షకు పైగా నష్టం
వీధి కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలం కాసాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కాసాల గ్రామానికి చెందిన పాతూరి మహేష్ సతాయిలకు చెందిన 16 గొర్రెలపై వీధికుక్కలు దాడి చేయడంతో మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. సుమారు లక్షపైగా నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. జీవనాధారమైన గొర్రెలు చనిపోవడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.