హత్నూర: సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన మాలల రణభేరికి బయలుదేరిన హత్నూర మండల మాలమహానాడు నాయకులు
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సరూర్నగర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన మాలల రణభేరి సభకు అద్మరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి మలమానాడు నాయకులు తరలి వెళ్లారు. మాల మహానాడు మండలాధ్యక్షుడు రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎస్సీలను వర్గీకరించి రాజ్యాధికారానికి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జిఓ 99 సవరించి 25 కులాలకు న్యాయం చేయాలని అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షులు పరుశురాం తదితరులు పాల్గొన్నారు.