హత్నూర: గీతన్నల రణభేరి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలుగీత కార్మిక సంఘం నాయకులు
గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న రణభేరి వాల్పోస్టర్ను సోమవారం సంగారెడ్డి పట్టణంలోని ఐబి వద్ద ఆవిష్కరించారు. ఈనెల 28న గీతనుల రణభేరి కార్యక్రమాన్ని సూర్యాపేటలో నిర్వహిస్తున్నట్లు భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కలిగిత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళ్ళ గీత కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు రామ గౌడ్ వెంకటేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.