హత్నూర: గ్రామపంచాయతీలో ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
గ్రామ పంచాయతీల ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. గురువారం మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించిన రిజర్వేషన్ జియో లోకేషన్ వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.