హత్నూర: ఒక సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం : హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి
ఒక సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కోడిపాక గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో గ్రామంలో పురవీధుల గుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాబు యాదవ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.