రాప్తాడు: రాప్తాడు జడ్పీహెచ్ పాఠశాలలో అంగన్వాడి వర్కర్లకు జ్ఞాన జ్యోతి శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ ఉమా శంకరమ్
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఉమా శంకరమ్మ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమాశంకరమ్మ మాట్లాడుతూ రాప్తాడు మండలంలో అంగన్వాడీ వర్కర్లకు మూడు రోజులు పాటు 44 మందికి జ్ఞాన జ్యోతి శిక్షణ ఇవ్వడం జరిగిందని ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు సంవత్సరాల పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎదుగుతున్న సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇతర హెల్త్ చెకప్ పైన అంగన్వాడీ వర్కర్లకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని ఐసిడిఎస్ ఉమాశంకరమ్మ పేర్కొన్నారు.