రాజేంద్రనగర్: ఎంకపల్లిలో గోశాల ఏర్పాటుపై రైతుల ఆందోళన
మొయినాబాద్ మం.లోని ఎంకేపల్లి గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. ఎంకేపల్లిలో గోశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకోవడం జరిగిందని, అయితే తమకు ఎలాంటి న్యాయం జరగకముందే భూములను పోలీసుల పహారాలో అధికారులు సర్వే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.