అలియాబాద్ మున్సిపల్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. లాల్గడి మలక్పేట గ్రామ పంచాయతీ వద్ద ఉన్న విద్యుత్ స్తంభం వైర్లకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.