షాద్నగర్ పట్టణంలో మహాపడిపూజ నేపథ్యంలో కన్నె స్వాముల దీపారాధన నిర్వహించారు. పట్టణంలోని పోచమ్మ ఆలయం నుంచి శివ మారుతి గీత అయ్యప్ప మందిరం వరకు పెద్ద ఎత్తున కన్నె స్వాములు పాల్గొని దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.